: థానేలో ఘోరాతిఘోరం... ఏడుగురు చిన్నారులు సహా 14 మందిని హత్య చేసిన కిరాతకుడు


మహారాష్ట్రలోని థానేలో ఘోరం జరిగింది. తన కుటుంబంలోని 14 మందిని గొంతు కోసి చంపేసిన ఓ కిరాతకుడు ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన థానేలో సంచలనం కలిగించింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఆస్తి తగాదాలే ఇంతటి దారుణానికి కారణమని భావిస్తున్నట్టు థానే సంయుక్త పోలీస్ కమిషనర్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో గొంతు తెగిన ఓ మహిళ మాత్రమే ప్రాణాలతో బయటపడిందని అన్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించామని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News