: జేఎన్యూలో మరో కలకలం... 'ఇండియా ఓ జైలు' అంటూ వెలసిన పోస్టర్లు


ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో మరో కలకలం చెలరేగింది. వర్శిటీలో మోదీ సర్కారును విమర్శిస్తూ పోస్టర్లు వెలిశాయి. "ఇండియా ఓ జైలు" అంటూ గోడలపై పోస్టర్లు కనిపిస్తున్నాయి. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రజలు మరో దేశంలో ఉన్నట్టు భావించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వీటిపై వ్యాఖ్యలున్నాయి. శనివారం రాత్రి వీటిని అతికించారని తెలుస్తోంది. ఈ సమాచారం గురించి తెలుసుకున్న పోలీసులు వర్శిటీ బయటున్న జిరాక్స్ షాప్ యజమానిని విచారిస్తున్నారు. ఈ పోస్టర్ల వెనుక ఎవరున్నారన్న విషయమై ఆరా తీస్తున్నారు. ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా కార్యక్రమాలు జరిగిన తరువాత, వర్శిటీలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News