: ఆసుపత్రులను చూసొచ్చేందుకు శ్రీలంక వెళ్లిన టీ-మంత్రి!


శ్రీలంకలో నెదర్లాండ్స్ సంస్థ ఎన్రాఫ్ నోనియస్ నిర్మించిన ఆసుపత్రులను చూసి వచ్చేందుకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సి లక్ష్మారెడ్డి నేతృత్వంలోని బృందం బయలుదేరి వెళ్లింది. రెండు రోజుల పాటు సాగే పర్యటనలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో అక్కడ నిర్మించిన హాస్పిటల్ ను ఈ బృందం పరిశీలిస్తుంది. కాగా, రూ. 5 వేల కోట్లతో, 5 వేల పడకల సామర్థ్యముండేలా పలు ప్రాంతాల్లో ఆసుపత్రులను నిర్మించేందుకు నెదర్లాండ్స్ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ తో పాటు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో వీటిని నిర్మించాలన్నది కేసీఆర్ అభిమతం. ఈ మేరకు ఎన్రాఫ్ నోనియస్ అధికారులు కేసీఆర్ ను కలిసి తమ ప్రతిపాదనలు అందించారు. వీటిని పరిశీలించిన కేసీఆర్, తొలుత లంకకు వెళ్లి అక్కడి ఆసుపత్రిని చూసి రావాలని పలువురు అధికారులతో కూడిన బృందాన్ని పంపారు.

  • Loading...

More Telugu News