: ఆదమరిస్తే కేసీఆర్ కిడ్నీలనూ అమ్మేసే ఘనులు కడియం, ఎర్రబెల్లి: రేవంత్


తెలంగాణ రాష్ట్రానికి రెండో దుష్టచతుష్టయం ఏర్పడిందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. "కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ లు ఎంతటి ఘనులంటే, కేసీఆర్ ఆదమరిచిన వేళ, ఆయన కిడ్నీలను అమ్మేసే రకాలు. హరీశ్ చెప్పేవన్నీ ఉడుత ఊపు మాటలే" అన్నారు. ఇప్పటివరకూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవితల దుష్టచతుష్టయం ఉందనుకున్నానని, ఇప్పుడు కడియం, ఎర్రబెల్లి, కొండా మురళి, వినయ్ భాస్కర్ లు వరంగల్ ప్రాంతంలో ఒకే పార్టీలో కలిసి మరో దుష్టచతుష్టయంగా తయారయ్యారని తెలిపారు. నాడు కొట్టుకుని, తిట్టుకున్న నేతలు, నేడు కలిసి ఎలా పనిచేయగలరని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News