: టీ-20లో 196 పరుగులు, సికింద్రాబాద్ కుర్రాడి సంచలనం
భారత టీ-20 చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. తెలంగాణ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సికింద్రాబాద్ వీనస్, ఆదిలాబాద్ టైగర్స్ జట్ల మధ్య పోటీ జరుగగా, సికింద్రాబాద్ యువకుడు రాధాకష్ణ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 75 బంతుల్లో 196 పరుగులు రాబట్టాడు. ఇందులో 19 ఫోర్లు, 15 సిక్సులు ఉండటం విశేషం. బౌండరీల రూపంలోనే 166 పరుగులు వచ్చాయి. ఓపెనర్ గా బరిలోకి దిగిన రాధాకృష్ణ, మరో ఎండ్ లో ఉన్న ఆటగాడు 10 పరుగులు చేయకముందే 100 పరుగులు చేయడం గమనార్హం. ఈ మ్యాచ్ లో సికింద్రాబాద్ వీనస్ జట్టు 20 ఓవర్లలో 253 పరుగులు చేయగా, ఆదిలాబాద్ టైగర్స్ 96 పరుగులు మాత్రమే చేసింది.