: పాక్ పై టీమిండియా ఘన విజయం
బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో జరిగిన టీట్వంటీ మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో పాక్ పై ఘన విజయం సాధించింది. 15.3 ఓవర్లలోనే టీమిండియా విజయ లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ ధోనీ కొట్టిన బౌండరీతో టీమిండియా గెలుపు తీరం చేరింది. కాగా, ఒకే ఒక్క పరుగుతో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. మహమ్మద్ సమీ వేసిన బంతిని ఆడబోయిన కోహ్లి(ఎల్బీడబ్ల్యు) అవుటవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు.