: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు అరెస్టు
భారత్-పాక్ టీ20 మ్యాచ్ పై క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు వ్యక్తుల నుంచి రూ. 25 వేలు నగదు, 10 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. బెట్టింగ్ వ్యవహారంలో ఇంకెవరికి సంబంధాలు ఉన్నాయనే విషయమై ఆరా తీస్తున్నామని చెప్పారు.