: చేతులెత్తేసిన పాక్... 83 పరుగులకే ఆలౌట్!
ఆసియాకప్ లో భాగంగా భారత్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ 17.3 ఓవర్లలో 83 పరుగులకే ఆల్ ఔటయ్యింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఏ స్థాయిలోనూ భారత్ బౌలింగ్ ను ఎదుర్కోలేకపోయింది. భారత్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్ మెన్ కకావికలయ్యారు. పాక్ జట్టులో మహ్మద్ హఫీజ్(4), షలీల్ ఖాన్(7), ఖుర్రామ్ మంజూర్(10), షోయబ్ మాలిక్(4), ఉమర్ అక్మల్(3), ఆఫ్రిది(2), రియాజ్(4) స్వల్ప స్కోరుకే ఔటవ్వగా... సర్ఫరాజ్ మాత్రం 25 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. పాక్ జట్టులో ఇతనిదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. కాగా, నెహ్రా, బూమ్రా, యువరాజ్ సింగ్ లు ఒక్కొక్క వికెట్, పాండ్యా మూడు, జడేజా రెండు వికెట్లు తీసుకున్నారు. 84 పరుగుల విజయలక్ష్యంతో భారత్ మరి కొద్ది సేపట్లో బరిలోకి దిగనుంది!