: ఆ 30వేల మందికి తిరిగి చెల్లిస్తాం: రింగింగ్ బెల్స్
ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్ కు ముందుగా డబ్బులు చెల్లించి ఫోన్ బుక్ చేసుకున్న వారికి తిరిగి ఆ మొత్తాన్ని చెల్లిస్తామని రింగింగ్ బెల్స్ తెలిపింది. ఫోన్ మొదటి ప్రీబుకింగ్ సమయంలో తొలుత 30,000 మంది చేసిన చెల్లింపులను తీసుకున్నామని సంస్థ ఎండీ మోహిత్ గోయల్ తెలిపారు. ఆ తరువాత సైట్ క్రాష్ అవడంతో బుకింగులు నిలిచిపోయాయన్నారు. తరువాత మళ్లీ బుకింగులు ప్రారంభించినా ఎవరి నుంచీ చెల్లింపులు తీసుకోలేదని చెప్పారు. అందరి దగ్గర నుంచి క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలోనే డబ్బులు తీసుకుంటామన్నారు. ముందుగా ఆ 30వేల మందికి రిఫండ్ ఇస్తామని స్పష్టం చేశారు.