: బిడ్డా, నా గురించి దిగులు పడకు..దేశం కోసం ఆలోచించు: ప్రధాని మోదీతో తల్లి
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పారు. మూడు రోజుల క్రితం తనకు కొంత నలతగా ఉందని చెప్పడంతో ఆమెను గుజరాత్ లోని గాంధీనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. మోదీ తల్లి ఆరోగ్యం ఎలా ఉందనే విషయమై ఒక ఆంగ్ల పత్రిక ప్రధానిని ప్రశ్నించగా ఇందుకు ఆయన స్పందిస్తూ తన తల్లి ఆయనతో చెప్పిన మాటలను ప్రస్తావించారు. ‘బిడ్డా.. నా ఆరోగ్యం గురించి నువ్వు బెంగపడవద్దు. దేశం కోసం ఆలోచించు. నీ లక్ష్య సాధనపై ఏకాగ్రత నిల్పు’ అని తన తల్లి తనతో చెప్పిందని మోదీ పేర్కొన్నట్లు ఆ ఆంగ్లపత్రిక పేర్కొంది.