: ఆమె కళ్లలో రాళ్లు...ఆశ్చర్యపోతున్న వైద్యులు!


చైనాకు చెందిన ఒక మహిళ కళ్లలో నుంచి గత ఏడేళ్లుగా రాళ్లు వస్తున్నాయి. ఈ వింత వ్యాధి గురించిన వివరాలు... ఏడేళ్ల క్రితం డింగ్ అనే మహిళ కళ్లలో మంటగా ఉందని తన భర్తకు చెప్పింది. నలక వంటిది ఏదైనా పడి ఉండవచ్చని అనుకున్న భర్త ఆమె కళ్లను పరీక్షగా చూశాడు. ఆమె కంటిలో ఒక చిన్నరాయి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. పరీక్షించిన వైద్యులు డింగ్ కంటిలో ఉన్న రాయిని తొలగించారు. మళ్లీ కొద్ది రోజులకు ఇదే సమస్య తలెత్తడంతో మళ్లీ వైద్యుల వద్దకు వెళ్లడంతో మరో చిన్న రాయిని గుర్తించారు. ఈ విధంగా గత ఏడేళ్ల నుంచి ఆమె కళ్లలో నుంచి చిన్న చిన్న రాళ్లను వైద్యులు తొలగిస్తూనే ఉన్నారు. ఈ అరుదైన వ్యాధిని చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. తన సమస్యను పరిష్కరించాలంటూ డింగ్ వైద్యులకు విజ్ఞప్తి చేస్తోంది.

  • Loading...

More Telugu News