: అనారోగ్యంతో మలయాళ దర్శకుడు రాజేష్ పిళ్ళై మృతి


అనారోగ్య సమస్యలతో మలయాళ దర్శకుడు రాజేష్ పిళ్ళై (41) ఈరోజు మృతి చెందారు. చిన్న వయసులోనే ఈ దర్శకుడు తనువు చాలించడంతో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, రాజేష్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'ట్రాఫిక్' సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. తాజాగా ఈయన దర్శకత్వంలో 'వేట్టా' చిత్రం వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ పనుల్లో పడిపోయే ఆయన తన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారని రాజేష్ సన్నిహితులు చెబుతున్నారు. గతంలోనే కాలేయమార్పిడి చికిత్స చేయించుకోవాల్సి ఉన్నప్పటికీ, ఆయన అశ్రద్ధ చేయడం వల్లనే ఇలా అర్థాంతరంగా ఆయన మరణించారని బంధుమిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News