: ‘వంగవీటి’ పాటలను ఎడిట్ చేయాలని సూచించిన దేవినేని!


‘వంగవీటి’ చిత్రంలోని పాటలను ఎడిట్ చేయాలని దర్శకుడు రాంగోపాల్ వర్మకు దేవినేని నెహ్రూ సూచించినట్లు సమాచారం. ‘వంగవీటి’ సినిమా గురించి దేవినేనితో వర్మ జరిపిన చర్చలు ముగిశాయి. ఈ చిత్రానికి సంబంధించి వర్మ రిలీజ్ చేసిన రెండు పాటల్లో సామాజిక వర్గాల పేర్ల ప్రస్తావన ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ సూచన చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అనవసర ప్రచారం కల్పించవద్దని, ముఫ్పై ఏళ్ల కిందట జరిగిన గొడవ వల్ల రెండు కుటుంబాలకు నష్టం జరిగిందని అన్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రశాంతంగా ఉందని దేవినేని సంతృప్తి వ్యక్తం చేశారు. దేవినేని, వర్మ భేటీలో ప్రధానంగా 1982 నుంచి జరిగిన పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News