: ఏప్రిల్ 9న తెలంగాణ టెట్ పరీక్ష... షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1 నుంచి 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఏప్రిల్ 9న పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ -1 జరుగుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 23న టెట్ ఫలితాలు విడుదల చేస్తారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ నెల 29న విడుదల చేయనున్నారు.