: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు తృటిలో తప్పిన ప్రమాదం
గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కొద్దిసేపటి క్రితం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తన సొంత నియోజకవర్గంలోని మేడికొండూరులో రూ.6 కోట్ల విలువతో ఏర్పాటు చేయనున్న రెండు వంతెనలకు ఆయన ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా పేరేచర్ల వంతెనపై వస్తున్న క్రమంలో ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్ లోని వాహనాలు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్పీడుగా వెళుతున్న క్రమంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన కాన్వాయ్ లోని ఐదు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే జయదేవ్ కు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు.