: లేపాక్షికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపే లక్ష్యం: బాలయ్య ప్రకటన


ప్రాచీక శిల్ప కళా సంపదకు పుట్టినిల్లయిన లేపాక్షికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు సాధించడమే తన లక్ష్యమని టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఏపీ సర్కారు అధికారికంగా నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాలను ఆయన కొద్దిసేపటి క్రితం అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిల్ప కళా సౌందర్యాన్ని గుర్తు చేశారు. ప్రాచీన శిల్పకళా సంపదతో పాటు తెలుగు ఆచార వ్యవహారాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ క్రమంలోనే లేపాక్షి ఉత్సవాలను మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News