: విజయవాడలో దేవినేని నెహ్రూతో రాంగోపాల్ వర్మ భేటీ... గంటకుపైగా చర్చలు


'వంగవీటి' చిత్రం కోసం విజయవాడలో పర్యటిస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూతో భేటీ అయ్యారు. దాదాపు గంట నుంచి వారిద్దరి మధ్య సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఉన్న శుత్రుత్వం, ఆ నాటి ఘర్షణలు వంటి పలు విషయాలపై లోతుగా తెలుసుకునేందుకు నెహ్రూతో వర్మ మాట్లాడుతున్నట్టు సమాచారం. అంతకుముందు నగరంలో ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్ రావును వర్మ కలిశారు. పలు కేసులకు సంబంధించి ఆయన నుంచి వర్మ సమాచారాన్ని సేకరించారు. అయితే, వర్మతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కర్నాటి, అసలు విజయవాడలో బేసిక్ గా రౌడీయిజమే లేదని చెప్పడం కొసమెరుపు!

  • Loading...

More Telugu News