: 'వంగవీటి' నిర్మాణాన్ని బ్యాన్ చేయాలి... వర్మపై బెజవాడ సీపీఎం నేత ఫైర్


దివంగత వంగవీటి మోహన రంగ జీవితం ఆధారంగా ‘వంగవీటి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానంటూ విజయవాడలో అడుగుపెట్టిన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు నిన్న ఘన స్వాగతం లభించింది. ఈ రోజు ఆయన పలువురు నేతలతో వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమ పార్టీగా గుర్తింపు సాధించిన సీపీఐ... వర్మపై విరుచుకుపడింది. సీపీఐ విజయవాడ శాఖకు చెందిన కీలక నేత దోనెపూడి శంకర్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ వర్మపై ఫైరయ్యారు. ‘వంగవీటి’ చిత్రనిర్మాణంపై నిషేధం విధించాలని, అలాగే ప్రశాంతంగా ఉన్న బెజవాడలో తన చిత్రంతో అలజడి రేపేందుకు యత్నిస్తున్న వర్మను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్రంలో తమ పార్టీ నేత చలసాని వెంకటరత్నాన్ని కత్తిపట్టిన రౌడీగా చిత్రీకరించారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News