: మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసిన శివసేన నేత అరెస్టు


ముంబయి నడిబొడ్డున ఓ మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసిన శివసేన నేతను పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల కిందట సెల్ ఫోన్ లో మాట్లాడుతూ కారు నడుపుతున్న సదరు నేతను కానిస్టేబుల్ ఆపారు. అనంతరం వాహనానికి సంబంధించిన పత్రాలు చూపాలని కోరారు. దాంతో ఒక్కసారిగా సేన నేత ఆమెపై దాడికి దిగాడు. 'నా కారునే ఆపుతావా?' అంటూ ఇష్టమొచ్చినట్టు కొట్టారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వెంటనే బాధిత కానిస్టేబుల్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని శశికాంత్ కాలేగూడేగా గుర్తించారు. అనంతరం 353, 354 సెక్షన్ల కింద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి చేయడం, మహిళా వేధింపులకు పాల్పడడం వంటి సెక్షన్ల కింద శశికాంత్ పై కేసు నమోదు చేశారు. దానిపై స్పందించిన శివసేన పార్టీ, చట్టం తనపని తాను చేసుకుపోతుందని పేర్కొంది.

  • Loading...

More Telugu News