: ఆటిజం పిల్లల తల్లిదండ్రులకు శుభవార్త


ఆటిజం వ్యాధి లక్షణాలు కనిపించే పిల్లల తల్లిదండ్రుల మానసిక వేదన అంత సులువుగా చెప్పలేం. అలాంటి వారికి శుభవార్త ఇది. ఆటిజం పిల్లల్లో నీళ్ల విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. జీర్ణకోశంలో ఉండే క్లోస్ట్రిడియం బోల్టీయే అనే బ్యాక్టీరియా ప్రభావంతో ఇలా జరుగుతుంది. సాధారణ పిల్లల్లో కంటె ఆటిజం పిల్లల పేగుల్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడం వలన ఈ లక్షణాలు కనిపిస్తాయి.

అయితే ఈ బోల్టియే బ్యాక్టీరియాను అడ్డుకునే టీకాను కెనడాలోని గ్యూయెల్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. ఆటిజం పిల్లల్లో ఈ ఇబ్బందుల నివారణకు యాంటీబయోటిక్‌ మందులతోనే చికిత్సలు చేస్తుంటారు. అలాంటివారికి ఈ టీకా ప్రయోగించడం వలన ఫలితం మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నారు.

  • Loading...

More Telugu News