: బిర్యానీ, సిగరెట్లు కావాలట!... పోలీసులకు జేఎన్ యూ విద్యార్థుల డిమాండ్ల చిట్టా!


పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు ఉరితీతను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించమే కాక జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల కింద అరెస్టైన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు పోలీసుల ముందు పెద్ద చిట్టానే పెట్టారట. జైలు ఫుడ్డు తినలేమన్న వారిద్దరూ... వర్సిటీ క్యాంటీన్ నుంచి బర్యానీ తీసుకురావాలని చెప్పారట. అంతేకాక తాను చైన్ స్మోకర్ నని చెప్పిన ఖలీద్... సిగరెట్లు అందించాలని కూడా కోరాడట. వారి పోరు భరించలేక పోలీసులు సమీపంలోని హోటల్ నుంచి భోజనం తెప్పించారట. ఇక తీహార్ జైల్లో తమ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ ఉంటున్న గదిలోనే తమను కూడా ఉంచాలని వారు డిమాండ్ చేశారట. బయటి ఫుడ్డుతో వారి కడుపు నింపిన పోలీసులు మిగిలిన కోర్కెలను మాత్రం తీర్చకుండానే వారిని లాకప్ లోకి నెట్టేశారు. ఈ మేరకు ‘దైనిక్ భాస్కర్’ పత్రిక ఓ కథనాన్ని రాసింది.

  • Loading...

More Telugu News