: సినీ హాస్య నటి బండ జ్యోతి కన్నుమూత


తెలుగు సినీ హాస్య నటి బండ జ్యోతి కన్నుమూశారు. హైదరాబాద్ నానక్ రాంగూడలోని చిత్రపురికాలనీలో తన నివాసంలో గత రాత్రి(శుక్రవారం) గుండెపోటుతో ఆమె మరణించారు. పలు సినిమాల్లో నటించిన జ్యోతి హాస్య పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. విజయరామరాజు, కల్యాణరాముడు, భద్రాచలం, అందగాడు, స్వయంవరం, గణేష్, తోకలేనిపిట్ట వంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు.

  • Loading...

More Telugu News