: లైసెన్స్ లేకుండా రోడ్డెక్కితే... నేరుగా జైలుకే!: మార్చి 1 నుంచి హైదరాబాదులో అమల్లోకి


మార్చి 1 నుంచి భాగ్యనగరి హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు మరింత కఠినతరం కానున్నాయి. సేఫ్ డ్రైవింగే ప్రధాన లక్ష్యంగా అమల్లోకి వస్తున్న ఈ నిబంధనలతో రూల్స్ అతిక్రమించే వారికి మాత్రం పట్టపగలే చుక్కలు కానరానున్నాయి. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అనుమతితో తెలంగాణ ట్రాఫిక్ పోలీసు విభాగం కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తోంది. ఈ నిబంధనల ప్రకారం... ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండెక్కి రోడ్డు మీదకు వస్తే... నేరుగా జైలు ఊచలు లెక్కించక తప్పదు. లైసెన్స్ లేకుండా తొలిసారి పట్టుబడితే ఒక రోజు, రెండో సారి దొరికితే రెండు రోజులు... అయినా తీరు మారకుండా మూడోసారి బుక్కైతే మాత్రం ఏకంగా వారం రోజుల పాటు జైల్లో గడపక తప్పదు. ఇక బైక్ పై వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలన్న నిర్ణయాన్ని పోలీసులు వెనక్కు తీసుకున్నారు. డ్రైవింగ్ చేసే వ్యక్తి మాత్రం తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాల్సిందే. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే... బండిని ఎవరు నడిపినా కేసు మాత్రం సదరు బైక్ యజమానిపైనే బుక్కవుతుందట.

  • Loading...

More Telugu News