: నేను అధ్యక్షుడినైతే...అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన భారతీయులంతా వెనక్కే!: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్య
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ నిన్న మరో సంచలన వ్యాఖ్య చేశారు. హ్యూస్టన్ లో నిర్వహించిన ముఖాముఖి సదస్సులో పాల్గొన్న ఆయన వలస విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే... అమెరికాలోని అక్రమ వలసదారులంతా వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి అమెరికాలోని భారతీయుల సంఖ్యనూ ఆయన ప్రస్తావించారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన 3 లక్షల మంది భారతీయులు సహా 1.10 కోట్ల మంది విదేశీయులు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్లి... తిరిగి సుదీర్ఘమైన చట్టబద్ధ ప్రక్రియ ద్వారా రావాలన్నారు. వారిలోనూ ఉత్తమమైన కొందరికే తిరిగి వచ్చేందుకు అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.