: ముద్రగడ రియల్ మెగా పవర్ స్టార్!... ‘స్క్రీన్’ స్టార్లంతా ఫేకేనన్న వర్మ
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో కలకలం రేపే అవకాశాలు లేకపోలేదు. సిల్వర్ స్క్రీన్ పై మెగా పవర్ స్టార్లుగా వెలుగొందుతున్న స్టార్లను వర్మ... ఫేక్ స్టార్లుగా తేల్చిపారేశారు. అదే సమయంలో కాపు ఐక్య వేదిక నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ముద్రగడను రియల్ మెగా పవర్ స్టార్ గా ఆయన అభివర్ణించారు. రాజకీయాలు, ప్రజా సంక్షేమంపై తనకు నమ్మకం లేకపోయినప్పటికీ, ముద్రగడ రాజకీయ పార్టీ పెడితే మాత్రం తాను అందులో చేరతానని కూడా వర్మ ప్రకటించారు.