: కోర్టు ముందు లొంగిపోతున్నా... పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు: డిగ్గీరాజా


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ నేడు కోర్టు మెట్లెక్కనున్నారు. డిగ్గీరాజా సీఎంగా ఉండగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ సెక్రటేరియట్ లో జరిగిన నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణకు హాజరుకాని నేపథ్యంలో ఆయనపై భోపాల్ కోర్టు నిన్న నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన మీడియా ముందుకు వచ్చారు. ‘శనివారం కోర్టు ముందు లొంగిపోతున్నా. ఒకవేళ మధ్యప్రదేశ్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయాలని భావిస్తే చేసుకోవచ్చు’’ అని డిగ్గీరాజా ప్రకటించారు.

  • Loading...

More Telugu News