: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉద్యోగి బ్రెయిన్ డెడ్
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కొత్తపల్లి హేమప్రసాద్ (55) అనే ఉద్యోగిని వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. ఈరోజు వర్శిటీలో విధులు నిర్వహిస్తున్న ఆయనకు గుండెపోటు రావడంతో కోమాలోకి వెళ్లాడు. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు ఆయన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హేమప్రసాద్ ను పరీక్షించిన వైద్యులు ఆయనను 'బ్రెయిన్ డెడ్'గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో హేమ ప్రసాద్ అవయవాలను దానం చేసేందుకు ఆయన కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. ఆయా ఆసుపత్రులకు ఫోన్ చేసి ఈ సమాచారాన్ని తెలిపారు.