: ‘వంగవీటి’ షూటింగ్ మొత్తం ముంబయ్ లోనే ఉంటుంది: రాంగోపాల్ వర్మ


‘వంగవీటి’ చిత్రం షూటింగ్ మొత్తం ముంబయ్ లోనే జరుగుతుందని దర్శకుడు రాంగోపాల్ వర్మ వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన సమాచారం కోసం విజయవాడ చేరుకున్న ఆయనతో విలేకరులు మాట్లాడారు. సబ్జెక్టుపరంగా ‘వంగవీటి’తో పోలిస్తే 'శివ' చిత్రం చాలా చిన్నదని అన్నారు. తాను నమ్మిన నిజం, తెలిసిన నిజంతో ఈ చిత్రాన్ని తీస్తున్నానని చెప్పారు. ‘వంగవీటి’ కోసం చాలా స్టడీ చేశానని అన్నారు. వంగవీటి రంగా హయాంలో గ్రూప్ ఇజం, విజయవాడలో శాంతిభద్రతలు, రాజకీయనాయకుల వైఖరి ... మొదలైన అంశాలపై అప్పుడు తన వయస్సు రీత్యా తనకు ఉన్న అవగాహనకు, ఇప్పుడు ఉన్న అవగాహనకు చాలా తేడా ఉందన్నారు. చాలా మందిని కలిశానని.. చాలా విషయాలు తెలిశాయని అవగాహననేది ఎక్కువగా ఉందని వర్మ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News