: నాకు కొడుకులు లేరు.. నా కూతుర్ని సైన్యంలో చేరుస్తా: హనుమంతప్ప భార్య
‘నాకు కొడుకులు లేరు. అయినప్పటికీ నాకు దిగులు లేదు. నా కూతురిని సైన్యంలో చేరుస్తాను. అలా చేయడమే నా భర్తకు నిజమైన నివాళి’ అని అమర జవాన్ లాన్స్ నాయక్ హనుమంతప్ప భార్య మహాదేవి అన్నారు. హనుమంతప్ప తల్లిదండ్రులను పలు సంఘాల నాయకులు ఈరోజు ఘనంగా సన్మానించారు. నాగపూర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొన్నారు. దేశ సేవ చేసే అవకాశం రావడం చాలా గర్వకారణమని.. తన బిడ్డను సైన్యంలో చేర్పిస్తానని ఆమె అన్నారు. ఈ సందర్భంగా హనుమంతప్ప సోదరుడు శంకర్ గౌడకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లక్షరూపాయల చెక్కును అందజేశారు.