: ముంబయిలో ట్రాఫిక్ మహిళా కానిస్టేబుల్ పై చేయిచేసుకున్న నేత!


దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఓ రాజకీయ నేత రెచ్చిపోయాడు. విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ మహిళా కానిస్టేబుల్ పై చేయిచేసుకున్నాడు. ట్రాఫిక్ లో ఉండగా సదరు నేత డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు. దాంతో కానిస్టేబుల్ కారును ఆపింది. దాంతో, తన కారునే ఆపుతావా? అన్న కోపంతో కారు నుంచి దిగిన రాజకీయ నేత కానిస్టేబుల్ పై దాడి చేశాడు. ఆ వెంటనే మహిళా కానిస్టేబుల్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సీసీటీవీ పుటేజ్ లను బట్టి దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే దాడి చేసిన వ్యక్తి శివసేన పార్టీ నేత అంటూ వార్తలు వస్తుండగా; అతనికి, తమకు ఎలాంటి సంబంధం లేదని సేన పార్టీ చెబుతోంది. నిన్న (గురువారం) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News