: ఒకే విమానంలో వర్మ, దేవినేని నెహ్రూ!


దర్శకుడు రాంగోపాల్ వర్మ, దేవినేని నెహ్రూ కాస్సేపటి క్రితం ఒకే విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘వంగవీటి’ చిత్రంకు సంబంధించి మాట్లాడేందుకు ఆయన దేవినేనిని కలుస్తున్నారు. అయితే, వర్మ, దేవినేని ఇద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో బయలుదేరినట్లు వర్మ అభిమానుల నుంచి సమాచారం అందుతోంది. ఎయిర్ పోర్ట్ వద్దకు వర్మ, దేవినేని అభిమానులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, గతంలో వర్మ చాలాసార్లు విజయవాడ వచ్చి వెళ్లినప్పుడు ఎటువంటి ఆర్భాటం లేకుండా ఉండేది. కానీ, ఈసారి అధికసంఖ్యలో అభిమానులు అక్కడికి చేరడంపై ఇదంతా పబ్లిసిటీ కోసం వర్మ ఏర్పాటు చేసిన తతంగమే అని అంటున్నారు.

  • Loading...

More Telugu News