: కన్నయ్య, ఉమర్, భట్టాచార్యలను కలిపి ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు


దేశద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులు కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్యలను ఢిల్లీ పోలీసులు నేడు కలిపి విచారించారు. నేటితో కన్నయ్య కస్టడీ ముగియనుండటంతో, మరిన్ని వివరాల కోసం పోలీసులు ముగ్గురినీ ఒకే చోట కూర్చోబెట్టారు. వర్శిటీలోకి వచ్చిన బయటి వారు ఎవరు? ఎన్నిరోజుల పాటు వారున్నారు? వారి వివరాలను అడిగినట్టు తెలుస్తోంది. మొత్తం ఐదు గంటల పాటు వీరిని ఆర్కే పురం పోలీసు స్టేషన్లో అధికారులు విచారించారు. తొలి రౌండులో ముగ్గురినీ విడివిడిగా ప్రశ్నించిన పోలీసులు, సమాధానాలను రికార్డు చేసి, ఆపై మరో విడత కలిపి కూర్చోబెట్టి అవే ప్రశ్నలు అడిగారు. రెండు టీములు ఇంటరాగేషన్ లో పాల్గొన్నాయని అధికారులు తెలిపారు. కాగా, వర్శిటీలో తాను ఎలాంటి జాతి వ్యతిరేక నినాదాలు చేయలేదని విచారణలో భాగంగా ఖలీద్ చెప్పినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News