: ఇక దర్శకత్వ పాఠాలు చెప్పనున్న దర్శకేంద్రుడు!
ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అనుభవాలు ఔత్సాహిక దర్శకులకు పాఠాలుగా మారనున్నాయి. సినిమారంగంలో దర్శకత్వ విభాగంలో అడుగుపెట్టదలచుకున్న వారికి రాఘవేంద్రరావు పాఠాలు బోధించనున్నారు. ఇందుకోసం ఒక స్కూలును ప్రారంభించనున్నట్లు స్వయంగా రాఘవేంద్రరావు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాఘవేంద్రరావు నేతృత్వంలో రానున్న ఈ పాఠశాల పేరు 'కేఆర్ఆర్ క్లాస్ రూం'. 'ప్రాక్టికాలిటీ ఇన్ ఫిలిం డైరెక్షన్' అనేది ట్యాగ్ లైన్ గా ఉంది. తన నిర్దేశకత్వంలో రానున్న ఈ స్కూల్ పై ఒక వీడియో కూడా ఆయన రిలీజ్ చేశారు.