: వైఎస్ బతికుంటే సాధించుకు వచ్చేవారు: రఘువీరా


కేంద్రం హామీ ఇచ్చిన విధంగా విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కనీసం ప్రస్తావించను కూడా ప్రస్తావించలేదని, ఇది పూర్తిగా చంద్రబాబు వైఫల్యమేనని అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైల్వే బడ్జెట్లో అన్యాయం జరిగితే, ఆయన వెళ్లి పోరాడి మరిన్ని ప్రాజెక్టులు, రైళ్లు తీసుకు వచ్చారని గుర్తు చేసుకున్నారు. తక్షణం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖకు జోన్ మంజూరు చేయించాలని, కొత్త రైల్వే లైన్లు సాధించుకు రావాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News