: కుప్పంలో రైతు ఆత్మహత్యలపై చంద్రబాబు సిగ్గు పడాలి: వామపక్ష నేతలు


సొంత నియోజకవర్గమైన కుప్పంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిగ్గు పడాల్సిన విషయమని వామపక్ష నేతలు విమర్శించారు. ఈరోజు కడపలో విలేకరులతో సీపీఎం నేత బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడారు. ఎంతసేపటికీ, నవ్యాంధ్ర రాజధాని అమరావతి చుట్టూ తిరగడం తప్పా, రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాయలసీమ ద్రోహిని కాదని చెప్పుకోవాల్సిన పరిస్థితి బాబుకు దాపురించిందంటూ వారు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News