: జాట్ ల ఆందోళనలో అత్యాచారాల పరంపర!...హర్యానా సర్కారును నివేదిక కోరిన హైకోర్టు


రిజర్వేషన్ల కోసం హర్యానాలో జాట్లు చేపట్టిన ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడిన వేళ... ఆ రాష్ట్రంలోని సోనెపట్ జిల్లా ముర్తాల్ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని దుండగులు స్వైర విహారం చేశారు. దారిన పోయే వాహనాలను ఆపడం, వాటిపై దాడి చేయడం, వాహనాల్లోని మహిళలను బయటకు లాగడం, పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెడం, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడడం... ఇదీ ఇటీవల ఓ నడిరేయి చోటుచేసుకున్న దారుణం. కనీసం పది మంది మహిళలపై ఈ దురాగతం జరిగింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ద పయనీర్’ వెలికి తీసిన ఈ ఘటనపై పంజాబ్, హర్యానా హైకోర్టు ఘాటుగా స్పందించింది. దీనిపై సుమోటోగా విచారణ చేపట్టిన కోర్టు... హర్యానా హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఘటనపై వాస్తవాలను పొందుపరుస్తూ సమగ్ర నివేదిక అందజేయాలని హైకోర్టు ఆ నోటీసుల్లో ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ఓ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి నాటి దురాగతాన్ని స్వచ్ఛందంగా బయటకు చెప్పేందుకు ముందుకు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News