: నేను దుర్గాదేవిని పూజిస్తాను: స్మృతి ఇరానీ


కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దుర్గా దేవిపై చదివిన ఓ ప్రకటన రాజ్యసభలో దుమారం రేపుతోంది. ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండడంపై స్మృతి స్పందించారు. తాను స్వయంగా దుర్గా మాత భక్తురాలినని, దుర్గాదేవిని పూజిస్తానని తెలిపారు. స్వయంగా హిందూ మతాన్ని ఆచరిస్తున్నానని చెప్పారు. అయితే జేఎన్ యూ అధికారిక డాక్యుమెంట్ ఆధారంగానే అక్కడి విద్యార్థులు నిర్వహించిన మహిషాసుర సంబరాలను సభలో వెల్లడించానని, ఆ డాక్యుమెంట్ ను చదువుతున్నప్పుడు తానెంతో బాధకు గురయ్యానని వివరించారు. అయితే స్మృతి క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు.

  • Loading...

More Telugu News