: మ్యాచ్ మధ్యలో నిష్క్రమించిన జకోవిచ్
దుబాయ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ అనూహ్యంగా మధ్యలోనే వైదొలగాడు. దుబాయ్ లో నిన్న(గురువారం) జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ ఆటగాడు ఫెలిసియనో లోపేజ్ తో ఆడుతుండగా అనుకోకుండా జకోవిచ్ కు కంటి సమస్య తలెత్తింది. దాంతో ఆడలేకపోయిన అతను మ్యాచ్ కొనసాగించలేనని అంపైర్ కు చెప్పాడు. దాంతో మ్యాచ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. 2011లో కూడా ఇలాగే అర్జెంటైనా ఆటగాడు డెల్ పొట్రోతో ఆడుతుండగా జకోవిచ్ ఉన్నట్టుండి మ్యాచ్ నుంచి వైదొలగాడు.