: అడ్వాన్సులు కాదు, ఎదురు డబ్బడుగుతున్నారు: దాసరి


తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడున్న స్థితిలో పెద్ద హీరోలు లేకుంటే, ఆ చిత్రం అమ్ముడయ్యే పరిస్థితి లేదని దర్శకరత్న దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. సినిమా విడుదలకు ముందే డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్సులు ఇచ్చే పరిస్థితి కూడా పోయిందని, ముఖ్యంగా చిన్న నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిర్మాతలే థియేటర్స్ ను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతలు డబ్బిస్తేనే థియేటర్లలో చిత్రం విడుదలవుతోందని చెప్పారు. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో, కామెడీ చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహరావు తీసిన 'ఎలుకా మజాకా' చిత్రం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎదురు డబ్బు అడిగే పరిస్థితి పోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. థియేటర్లలో ఐదు ఆటలకు అనుమతించి మధ్యాహ్నం 1 గంట ఆట చిన్న చిత్రాలకు కేటాయించాలని తాము చేసిన విన్నపానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని దాసరి అన్నారు.

  • Loading...

More Telugu News