: హీరోయిన్ మేఘనా రాజ్ పెళ్లి చేసుకుని మోసం చేసిందని వ్యాపారి ఫిర్యాదు


తెలుగు సహా దక్షిణాది భాషల్లో నటించిన హీరోయిన్ మేఘనారాజ్ తనను వివాహం చేసుకుని, ఆపై మోసం చేసిందని తమిళ వ్యాపారి జనార్దన్ కేసు పెట్టాడు. అయితే, ఆమె పెళ్లి చేసుకున్నదని చెప్పడానికి సాక్ష్యాలను మాత్రం చూపలేకపోయాడు. తనతో కొంతకాలం కాపురం చేసిన తరువాత మ్యారేజ్ సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లిపోయిందని బెంగళూరు కమిషనర్ మేఘరిక్ కు ఫిర్యాదు చేయడంతో, ఆయన కేసును డీసీపీ లోకేశ్ కుమార్ కు అప్పగించారు. ఆపై తొలుత జనార్దన్ ను విచారించగా, ఆమె ఎక్కడ ఉందన్న విషయాన్ని, వివాహానికి సాక్ష్యాలనూ అందించలేకపోయాడు. కాగా, ఆ ఫిర్యాది ఎవరో తమకు తెలియదని మేఘనా తల్లి ప్రమీలా జోషాయ్ వెల్లడించారు. తన కుమార్తె ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఈ తరహా కేసులు పెడుతున్నారని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News