: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు ఆఫ్గన్ లో పాక్ సైన్యం శిక్షణ, మారణాయుధాల సరఫరా
ఆఫ్గనిస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ సైన్యం శిక్షణను ఇస్తోంది. వారికి అత్యాధునిక మారణాయుధాలను కూడా అందించి, ఆఫ్గన్ సైన్యంపై యుద్ధానికి పురికొల్పుతోంది. ఈ విషయాన్ని గతంలో ఐఎస్ఐఎస్ ఫైటర్ గా ఉండి, ఆపై ఆయుధాలు వీడి, ప్రస్తుతం శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్న జైతూన్ వెల్లడించాడు. తేలికపాటి, భారీ ఆయుధాలను వారు సరఫరా చేస్తున్నట్టు వివరించాడు. తాము యుద్ధం చేస్తున్న వైనంపై నిత్యమూ రిపోర్టును తీసుకునేవారని చెప్పాడు. కాగా, ఆత్యున్నత శాంతి సంఘం ఆధ్వర్యంలో 10 మంది వరకూ ఉగ్రవాదులు ఆయుధాలు వీడినట్టు సంఘం చైర్మన్ మాలిక్ నాజిర్ తెలిపారు. శాంతి చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నామని, తొలిసారిగా దయేష్ విభాగం ఫైటర్లు 10 మంది శాంతి మార్గంలోకి వచ్చారని వివరించారు.