: సానియామీర్జాకు షాక్... అప్రతిహత జైత్రయాత్రకు బ్రేక్!


సమకాలీన టెన్నిస్ ప్రపంచంలో గత సంవత్సరం ఆగస్టు నుంచి కొనసాగుతున్న సానియామీర్జా, మార్టినా హింగిస్ ల జోడీ హవాకు అడ్డుకట్టపడింది. వరుసగా 41 మ్యాచ్ లు గెలిచి ఆల్ టైం రికార్డుకు కేవలం 3 మ్యాచ్ ల దూరంలో ఉన్న ఈ జంట దోహాలో జరుగుతున్న ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ లో తడబడింది. రష్యన్ జోడీ ఎలెనా వెస్నినా, దారియా కసక్తినా జోడీ చేతిలో 2-6, 6-4, 10-5 తేడాతో సానియా, హింగిస్ లు ఓడిపోయారు. గత సంవత్సరం ఆగస్టులో సిన్సినాటి టోర్నీలో పరాజయం తరువాత సానియా జోడీ వెనుదిరిగి చూడలేదు. ఆపై మూడు వరుస గ్రాండ్ స్లామ్ లను, చిన్న టైటిళ్లనూ గెలిచింది. దోహాలో సానియా జంట ఓటమితో 44 వరుస మ్యాచ్ ల రికార్డున్న జానా నవోత్నా, హెలెనా సుకోవాల రికార్డు ఇప్పటికి పదిలమే.

  • Loading...

More Telugu News