: పఠాన్ కోట్ దాడికి ముందు... పాక్ నుంచి తెచ్చుకున్న చికెన్ ను ఫుల్లుగా లాగించిన ఉగ్రవాదులు


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిలో పాకిస్థాన్ ప్రమేయానికి సంబంధించి మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. పక్కా వ్యూహంతో అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్ లోకి ప్రవేశించిన పాకిస్థానీ ఉగ్రవాదులు... ఏమాత్రం ఆకలిగొనకుండా ఉండేందుకు భారీ ఎత్తున ఆహార పదార్థాలను తమ వెంట తెచ్చుకున్నారు. వారు తెచ్చుకున్న ఆహారపదార్థాల్లో చికెన్ నెహారీతో పాటు షాహీ పన్నీర్, దాల్ ఫ్రై, లాహోరీ చోలే తదితర వంటకాలున్నాయి. ఈ పదార్థాలను ఉగ్రవాదులు ప్యాకెట్లలో తెచ్చుకున్నారట. అంతేకాక సదరు ఆహారపదార్థాలు పాక్ నగరం కరాచీలో తయారైనట్లుగా ఆ ప్యాకెట్లపై స్పష్టమైన లేబుళ్లు ఉన్నాయి. ఈమేరకు పఠాన్ కోట్ కు సమీపంలో సరిహద్దు ప్రాంతంలోని సింబల్ బీఎస్ఎఫ్ ఔట్ పోస్ట్ వద్ద నిన్న భద్రతా బలగాలు సదరు ఖాళీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాయి. పరీక్షల నిమిత్తం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. తమ వెంట తెచ్చుకున్న చికెన్, ఇతర పదార్థాలను ఫుల్లుగా లాగించేసిన ఉగ్రవాదులు ఎయిర్ బేస్ పై మెరుపు దాడికి దిగారు. ఈ దాడిపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా త్వరలో భారత్ రానున్న పాక్ అధికారులకు ఈ ప్యాకెట్లను కూడా అందజేయనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News