: నకిలీ పామాయిల్ తయారీ కేంద్రం గుట్టురట్టు


జంట నగరాల్లో మరో కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రం గుట్టు రట్టయింది. ఎల్బీ నగర్ పరిధిలో ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ పామాయిల్, నెయ్యి తయారు చేస్తున్న కేంద్రంపై ఎస్ వోటీ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. రెండు వేల కిలోల నకిలీ పామాయిల్, 230 కిలోల నెయ్యి, 36 కిలోల డాల్డాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలి కాలంలో నగరంలోని పాతబస్తీ, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో పలు నకిలీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున నకిలీ వస్తువులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News