: చర్లపల్లిలో శాటిలైల్ టెర్మినల్: దక్షిణ మధ్య రైల్వే జీఎం గుప్తా
చర్లపల్లి రైల్వే స్టేషన్ లో 80 కోట్ల రూపాయలతో శాటిలైట్ టెర్మినల్ ను ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా తెలిపారు. రైల్వే బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపులపై ఆయన గురువారం మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. గుంటూరు - గుంతకల్ మధ్య కొత్త రైల్వే లైను నిర్మించనున్నామని వెల్లడించారు. తిరుపతి స్టేషన్ ను 10కోట్ల రూపాయలతో అబివృద్ధి చేయనున్నట్టు, అలాగే తిరుచానూరు రైల్వే స్టేషన్ ఏర్పాటుకు 10 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించినట్టు తెలిపారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ కు 90 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వెల్లడించారు. ఖాజీపేట వర్క్ షాపును 269 కోట్ల రూపాయలతో మరింతగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు.