: గతంలో కేసీఆర్ ను తిట్టినందుకు బాధపడుతున్నాను: ఎర్రబెల్లి


కొన్నిరోజుల కిందటి వరకు అధికారి పార్టీ టీఆర్ఎస్ ను, సీఎం కేసీఆర్ ను ఏకిపారేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు టీఆర్ఎస్ లో అధికారికంగా చేరడంతో, మాటతీరు కూడా మార్చేసుకున్నారు. కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, టీడీపీపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు. అయితే కేసీఆర్ పై విశ్వాసం ఉందని చెప్పారు. రెండు సంవత్సరాల కిందటే టీఆర్ఎస్ లో చేరాల్సిందన్న ఎర్రబెల్లి, గతంలో టీడీపీలో ఉండి కేసీఆర్ ను తిట్టినందుకు బాధపడుతున్నానని తెలిపారు. టీఆర్ఎస్ లో చేరింది రాజకీయ స్వార్థం కోసం కాదన్నారు. ఇక రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీ విషయంలో చంద్రబాబు చేతులెత్తేశారని, టీడీపీ ఇక మాయమైనట్టేనని వ్యాఖ్యానించారు. మంత్రి కడియం శ్రీహరికి, తనకు విభేదాలు సమసిపోయినట్టేనని, ఇద్దరినీ కూర్చోబెట్టి కేసీఆర్ మాట్లాడారని తెలిపారు. ఎన్నికల్లో బిజీగా ఉండటం వల్లే కడియం ఈ రోజు ఇక్కడికి రాలేకపోయారన్నారు. కేసీఆర్ ను తాను మంత్రి పదవి అడగలేదని, తన నియోజకవర్గానికి రూ.100 కోట్లు ఇస్తానన్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News