: తెలంగాణ రాజకీయ ఏకీకరణ దిశగానే టీఆర్ఎస్ లో చేరికలు: కేసీఆర్
అధికార పార్టీ టీఆర్ఎస్ లో పలువురు నేతల చేరికలను తెలంగాణ రాజకీయ ఏకీకరణ కోసమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు. ఇవేమీ చిల్లరమల్లర రాజకీయాలు కాదన్నారు. తన సమక్షంలో పార్టీలో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి మాట్లాడుతూ, ఎర్రబెల్లి చేరికను రాజకీయంతో ముడిపెట్టొద్దని కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే నేతలంతా టీఆర్ఎస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఇందుకోసం అందరం కలసి పని చేద్దామని, తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకువెళదామని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దయాకర్ రావు, అతని అనుచరులందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానన్నారు.