: అధికారికంగా టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లి


వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారికంగా ఇవాళ టీఆర్ఎస్ గూటికి చేరారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ స్వయంగా ఎర్రబెల్లి మెడలో పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు, ఎర్రబెల్లి అనుచరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News