: రైల్వే కూలీలను ఇక నుంచి 'సహాయక్' అనే పిలవాలి: సురేశ్ ప్రభు
రైల్వే స్టేషన్ లో లగేజ్ మోసే వారిని ఇంతవరకు 'కూలీ' అని పిలుస్తుండటం తెలిసిందే. కానీ ఇకపై వారిని 'సహాయక్'లు లేదా 'హెల్పర్స్' అని పిలవాల్సి ఉంటుంది. లోక్ సభలో రైల్వేబడ్జెట్ ప్రసంగంలో ఈ మేరకు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. వారికి గౌరవం కట్టబెట్టే దిశగా చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ కొత్త పేరును ప్రకటించారు. ఇక నుంచి వారిని రైల్వే కూలీలు అని పిలవకూడదని, కొత్త పేరుతోనే పిలవాలని మంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో వారికి కొన్ని ప్రత్యేక అంశాల్లో శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. విమానాశ్రయాల్లోలా వారికి ట్రాలీలను కూడా అందిస్తామని తెలిపారు.