: బడ్జెట్ లో ఏపీ, తెలంగాణ రైల్వే లైన్లకు నిధుల కేటాయింపు
రైల్వే బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు ఎలాంటి కొత్త ప్రాజెక్టులు ప్రకటించని సంగతి తెలిసిందే. అయితే ఆయా రైల్వేలైన్ల పనులకు నిధులు కేటాయించారు. కాజీపేట-విజయవాడ మూడో లైన్ కు రూ.114 కోట్లు, రాఘవాపురం-మందమర్రి లైన్ కు రూ.15 కోట్లు, సికింద్రాబాద్- మహబూబ్ నగర్ డబ్లింగ్ కు రూ.80 కోట్లు కేటాయించారు. పెద్దపల్లి-జగిత్యాల మధ్య సబ్ వే నిర్మాణానికి రూ.5 కోట్లు, కాజీపేట-వరంగల్ మధ్య ఆర్ ఓబీ నిర్మాణానికి రూ.5కోట్లు, పెద్దపల్లి-నిజామాబాద్ లైన్ కు రూ.70 కోట్లు, మునీరాబాద్ -మహబూబ్ నగర్ లైన్ కు రూ.180 కోట్లు, మాచర్ల-నల్గొండ లైన్ కు రూ.20 కోట్లు, కోటిపల్లి-నర్సాపురం లైనుకు రూ.200 కోట్లు, పిఠాపురం- కాకినాడ లైనుకు రూ.50 కోట్లు, కేటాయించారు.